వైఎస్ వివేకా హత్య కేసులో ముగిసిన ఈడీ సోదాలు
21-08-2026 04:58 PM
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసు(YS Viveka murder case)లో ఈడీ(Directorate of Enforcement) సోదాలు ముగిశాయి. విచారణలో భాగంగా హైదరాబాద్, కడప సహా ఏడు చోట్ల, అంతేకాకుండా ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy)తో సహ కీలక నిందితుల ఇళ్లలోను ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు పత్రాలు, డిజిటల్ పరికరాలను, అవినాష్ రెడ్డి నివాసంలో లెక్కచూపని రూ.24 లక్షలు సీజ్ చేసి, 2 లాకర్ల తాళాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. కేసులో రాజకీయ నేతల ప్రమేయం, మనీలాండరింగ్ పై ఈడీ ఆరా తీస్తున్నారు. హత్యకు ముందు నగదు లావాదేవీల వ్యవహారం బయటకు రావడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.






