ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి
ఇబ్రహీంపట్నం,(విజయక్రాంతి): అదిబట్ల సర్కిల్ పరిధిలోని బొంగ్లూర్ లో ఇంటెన్సివ్ రివిజన్ (సార్) కార్యక్రమాన్ని అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారమ్‌లను పంపిణీ చేసే ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్ఓ) శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించారు. స్వయంగా ఓటరును కలిసి ఎన్యుమరేషన్ ఫారమ్‌ను అందజేసి, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. అలాగే ఫారమ్‌ల పంపిణీ, నమోదు వివరాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఇంటికి చేరుకుని అర్హులైన ఓటర్లందరికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌లు అందేలా చర్యలు తీసుకోవాలని, నిర్ణీత గడువులోగా నాణ్యతతో పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ద్వారా ప్రతి అర్హత కలిగిన ఓటరికి ఎన్యుమరేషన్ ఫారమ్‌లు సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.






