3 May, 2026 | 1:29 AM

మోదీ సభను విజయవంతం చేయండి

03-05-2026 12:00 AM

బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ వినయ్ కుమార్

ముషీరాబాద్,మే2 (విజయక్రాంతి): ఈ నెల10న సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో జరగనున్న  జన ఆగ్రహ సభను విజయవంతం చేయాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఏ. వినయ్ కుమార్ పిలుపునిచ్చారు.  గాంధీనగర్ డివిజన్ అశోక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ ప్రాంగణంలో మోడీ సభ సన్నాహక సమావేశం డివిజన్ బీజేపీ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ముఖ్య అతిథిగా డివిజన్ ఇన్చార్జి కె. నాగేశ్వర్‌రెడ్డి,  సికింద్రాబాద్ పార్లమెంట్ జా యింట్ కన్వీనర్  ఎ. వినయ్ కుమార్,  బీజే పీ బూత్ అధ్యక్షులు, మహిళా నాయకులు, అన్ని మోర్చల అధ్యక్షులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

ఈ నెల 10 వ తేదీన సాయంత్రం 4 గంటలకు సికింద్రా బాద్ లోని పెరెడ్ గ్రౌండ్స్ మైదానంలో జరగబోయే ‘జన ఆగ్రహ సభ‘ కు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విచ్చేయనున్న  సందర్భంగా గాంధీనగర్ డివిజన్ నుండి భారీ జన సామీకరణతో బయలుదేరి వెళ్లి   మోడీకి ఘన స్వాగతం పలికి, సభలో పాల్గొనాలని  నా యకులను కార్యకర్తలను కోరారు. ఈ సమావేశంలో బీజేపీ డివిజన్ ప్రధాన కార్యద ర్శులు శ్రీనివాస్, ఆనంద్ రావు, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, దామోదర్, ఎం. ఉమేష్, శివ కుమార్, సత్తిరెడ్డి, తదితరులు  పాల్గొన్నారు.