ముషీరాబాద్‌లో ఘనంగా శ్రీనివాస కల్యాణం
ముషీరాబాద్, మే2 (విజయక్రాంతి): ముషీరాబాద్‌లో ప్రసిద్ధిగాంచిన మహంకాళి దేవాలయ ప్రధాన అర్చకులు వై. చంద్రమౌళి ఆధ్వర్యంలో శనివారం ముషీరాబాద్ పోలీస్టేషన్ సమీపంలో శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్లు సుప్రియా నవీన్ గౌడ్, ఎ.పావని వినయ్ కుమార్, గౌరీశంకర ఆలయ కమిటీ చైర్మన్ పి. శ్రీధర్‌చారి, ముషీరాబాద్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు డి. శివ ముదిరాజ్, సంగిశెట్టి రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పట్నం నాగభూషణంగౌడ్, జనిగె శ్రీనివాస్ యాద వ్లు హాజరై కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.
స్వామివారికి పూజలు నిర్వహించి కానుకలు సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో స్థానికంగా ఆధ్యాత్మికత వెల్లి విరిసింది.






