10 March, 2026 | 3:31 AM

హెచ్‌సీఏ సెక్రటరీగా జీవన్‌రెడ్డిని గెలిపించండి

10-03-2026 01:49 AM

హెచ్‌సీఏ ఓటర్లకు వీహెచ్ పిలుపు 

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి) : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్‌సీఏ) సెక్రటరిగా పోటీ చేస్తున్న జీవన్‌రెడ్డిని గెలిపించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వి. హనుమంతరావు పిలుపునిచ్చారు. మార్చి 15న జరిగే ఎన్నికల్లో సభ్యులు ఓటు వేసి గెలిపించాలన్నారు.

సోమవారం ఆయన ఫతేమైదాన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంచి ఆలోచన ఉన్న వ్యక్తి ముందుకు వస్తున్నప్పుడు గెలిపించుకోవడం మన బాధ్యత అని అన్నారు. జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి పాటుపడుతానని, గ్రామీణ ప్రాంతంలో క్రికెట్‌కు ప్రోత్సాహం అందిస్తానని జీవన్‌రెడ్డి చెబుతున్నారని వీహెచ్ తెలిపారు. 

ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు గోకరాజు రంగరాజు ఏపీలో ఎన్నో అభివృద్ది పనులు చేశారని వీహెచ్ గుర్తు చేశారు. తెలంగాణలో ప్రతి జిల్లాలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో హెచ్‌సీ మెంబర్ శేష్ నారాయణ, ఆది అవినాష్ తదితరులు పాల్గొన్నారు.