పారదర్శకంగా యూరియా పంపిణీ
10-03-2026 01:48 AM
నాగర్కర్నూల్, మార్చి 9 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లాలో యూరియా పంపిణీ యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖాధికారి ఎన్. యుగాంత్ రావు తెలిపారు. జిల్లాలో నేటి వరకు 8,68,977 బస్తాల యూరియా రైతులకు పంపిణీ చేయగా అందులో 3,30, 660 బస్తాల యూరియా యాప్ ద్వారా 66,141 మంది రైతులు యూరియా కొనుగోలు చేసినట్లు తెలిపారు.
గత యాసంగితో పోలిస్తే ఈ సారి సన్న వరి విస్తీర్ణం 66 వేల ఎకరాలు పెరగడంతో యూరియా డిమాం డ్ పెరిగిందన్నారు. గతేడాది కంటే ఈసారి 2,32,667 బస్తాల యూరియా అధికంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ నెలలో జిల్లాకు మరొక లక్ష బస్తాల యూరియా కేటాయించినట్లు చెప్పారు.




