నేడు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల
07-08-2026 09:40 AM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పోచారం ప్రాజెక్టు(Pocharam Project) నీటి విడుదల నేడు చేయనున్నట్లు ఇరిగేషన్ డిఈఈ కిష్టయ్య తెలిపారు.అధిక వర్షాలతో పోచారం ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగిపొర్లుతూ మంజీరా వాగులోకి ప్రవహించడంతో జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల నిమిత్తం నేడు ఉదయం 11 గంటలకు పోచారం ప్రధాన కాలువ ద్వారా నీటిని ఖరీఫ్ పంటల నిమిత్తం కోసం విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ శాఖ డిఈఈ కిష్టయ్య తెలిపారు.కావున మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు,నాయకులు హాజరుకావాలని కోరుతున్నామని డిఈఈ కిష్టయ్య తెలిపారు.






