7 August, 2026 | 10:59 AM

కొచ్చరి మైసమ్మ తల్లికి ఘనంగా బోనాలు

07-08-2026 09:47 AM

పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి...

నసురుల్లాబాద్, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలోని కొచ్చరి మైసమ్మ తల్లి ఆలయంలో బోనాల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల పండుగకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులతో సందడి నెలకొంది.అమ్మవారి ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు, పంటలు సమృద్ధిగా పండాలని గ్రామస్తులు ప్రార్థించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసి, సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు.బోనాల కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి మండల మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ బాల హరిచంద్ర రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరిక శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వెంకటరమణ, సర్పంచ్ల పోరం మండలం అధ్యక్షులు శ్యామ్ , ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు,గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.