7 August, 2026 | 10:58 AM

చెక్‌పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

07-08-2026 09:50 AM

నిర్మల్, (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో దొంగతనాలను నివారించేందుకై నిర్మల్ చుట్టూ ఏడు చెక్ పోస్ట్ లను జిల్లా ఎస్పీ జానకి చెరువుల పరిశీలించారు.. గురువారం సాయంత్రం పట్టణ శివారులోని సెయింట్ థామస్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్కు పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక అనిగా ఉంచాలని రాత్రి మరింత్ర అప్రమత్తంగా ఉండాలని అన్నారు. దొంగతనాలు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఇందులో డీఎస్పీ శ్రీనివాస్, టౌన్ సీఐ సమ్మయ్య, రూరల్ ఎస్సై లింబాద్రి ఉన్నారు.