14 July, 2026 | 6:24 PM

Breaking News

భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •   సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కల తొలగింపు   •  

మహా"శివరాత్రి"కి ఏర్పాట్లు చేయండి

14-02-2026 02:09 PM

బిజెపి కౌన్సిలర్లు.

తాండూరు,(విజయక్రాంతి): మహా మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉన్న శివాలయాల వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ నూతన మున్సిపల్ కౌన్సిలర్లు అంతారం కిరణ్ కుమార్, నాగారం మల్లేశం, శ్రీకాంత్ రెడ్డిలు మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివరాత్రి వేడుకలకు భక్తులు భారీ ఎత్తున శివాలయాలకు వస్తుంటారని దేవాలయాల వద్ద పారిశుధ్యం, వీధి దీపాలు, త్రాగునీరు తదితర ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను వారు కోరారు