14 July, 2026 | 6:56 PM

Breaking News

విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •  

మహాశివరాత్రి వేడుకలు ప్రారంభం

14-02-2026 02:30 PM

హనుమకొండ, ఫిబ్రవరి 14( విజయ క్రాంతి):మహా శివరాత్రి వేడుకల(Mahashivratri celebrations) సందర్భంగా వరంగల్‌లోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ రుద్రేశ్వర స్వామి (వెయ్యి స్తంభాల ఆలయం) లో శనివారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి శ్రీ రుద్రేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. 

ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. అనంతరం లోకకల్యాణార్థం నిర్వహించిన పార్వతి పరమేశ్వరుల కళ్యాణం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనం చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి నాయిని నీలిమ రెడ్డి, కుమార్తె డా. శ్రీగోదా విష్ణురెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, మణికంఠ శర్మ తదితరులు పాల్గొన్నారు.