14-02-2026 02:07:44 PM
కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు(Government Degree College Students) క్షేత్ర పర్యటనలో భాగంగా మహారాష్ట్రలోని విసాపూర్ లో గల బొటానికల్ గార్డెన్ సందర్శించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీదేవి తెలిపారు. కళాశాల వృక్ష మరియు జంతు శాస్త్ర విభాగాలకు చెందిన విద్యార్థులు ఈ పర్యటనలో పాల్గొని పలు విషయాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీదేవి మాట్లాడుతూ ఇలాంటి క్షేత్ర పర్యటనల వల్ల విద్యార్థులకు ఆయా అంశాలపై ప్రత్యక్ష అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నారు.బొటానికల్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన వివిధ సైన్స్ పరికరాలపై ప్రిన్సిపాల్ విద్యార్థులకు వివరించారు.
అనంతరం కళాశాల వృక్ష శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ వి.దేవేందర్ రెడ్డి విద్యార్థులకు వివిధ ఔషధ,ఆర్థిక ప్రాముఖ్యత గల మొక్కల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.బొటానికల్ గార్డెన్ లోని జీవ వైవిధ్యం గురించి జంతుశాస్త్ర అధ్యాపకులు బి.వెంకటేశం వివరించగా, మహారాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక నిర్మాణాలు,వారసత్వ సంపద గురించి తెలుగు, హింది విభాగాధిపతులు డా.డి.లక్ష్మినరసింహం, డి.జనార్థన్ విద్యార్థులకు తెలియజేశారు. ఈ క్షేత్ర పర్యటనలో అధ్యాపకులు డా.ఇ.శారద,బి.వెంకటేశం,మల్లిఖార్జున్,నర్సింగరావు పాల్గొన్నారు.