6 April, 2026 | 4:38 AM

అమెరికాకు భారీ ఎదురుదెబ్బ

05-04-2026 01:34 AM
  1. ఒకే రోజులో రెండు యుద్ధవిమానాలను కూల్చేసిన ఇరాన్
  2. ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్, ఏ-10 వార్థగ్ ఫైటర్ జెట్‌ను పేల్చేసిన ఐఆర్‌జీసీ
  3. సురక్షితంగా బయటపడ్డ ఇద్దరు పైలట్లు, మరొకరి కోసం గాలింపు

టెహ్రాన్, ఏప్రిల్ 4: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల్లో అమెరికా అనేక షాక్‌లను ఎదుర్కొంటోంది. ఒకే రోజు రెండు అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూ ల్చివేసింది. అదేవిధంగా రెండు హెలికాప్టర్లపై కూడా దాడులు జరిగాయి. ఈ ఘట నల్లో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని, మరొక పైలట్ గల్లంతైనట్లు సమా చారం. శుక్రవారం అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసింది.

ఈ విమానంలో ఒక పైలట్, వెపన్ సిస్టమ్ అధికారి ఉన్నారు. అధికారులు ఒకరిని రక్షించామని, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోందని అమెరికా, ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే హోర్ముజ్ సమీపంలో ఏ-10 వార్థగ్ ఫైటర్ జెట్‌ను కూడా ఇరాన్ కూల్చేసింది. ఈ విమాన శకలాలు కువైట్‌లో పడినప్పటికీ, ఆ పైలట్ సు రక్షితంగా బయటపడ్డాడు.

మొదటి యుద్ధ విమానంలో గల్లంతైన పైలట్‌ను రక్షించడానికి రెండు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు గాలింపు చేపట్టాయి. వీటిపైనా ఇరాన్ దాడి చేసింది. అయితే వీటిని తప్పించుకుని సురక్షితంగా గగనతలం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ పరిణామాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సమాచారం అందించారు. ఈ మేరకు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ పేర్కొన్నారు.

ఏ-10 యుద్ధ విమానం కూలిన దృశ్యాలను ముం బైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఘటనలపై స్పందిస్తూ ఇలాంటి సంఘటనలు దౌత్య చర్చలపై ప్ర భావం చూపవని పేర్కొన్నారు. ‘ఇది యు ద్ధం, మేం యుద్ధంలోనే ఉన్నాం’ అని తెలిపారు. ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణల్లో అమెరికా గణనీయంగా షాక్‌లను ఎదుర్కొంటున్నప్పటికీ, అధికారికంగా దౌత్య చర్చలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం అ య్యింది. అయితే వైమానిక దళ సైనికుడి కోసం నైరుతి ఇరాన్‌లోని పర్వత ప్రాంతంపై అమెరికా సైన్యం గాలిస్తోంది.

ఇరాక్‌పై కూ ల్చివేయబడిన అమెరికా యుద్ధ విమానంలోని ఇద్దరు సభ్యుల సిబ్బందిలో ఒకరైన అమెరికా సైనికుడి కోసం, ఆ దేశంలోని నై రుతి ప్రావిన్సులైన కోహ్గిలుయే, బోయర్-అహ్మద్‌లోని పర్వత ప్రాంతంపై గాలిస్తున్నా యని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.