6 April, 2026 | 2:43 AM

ఎఫ్-15 పైలట్‌ను రక్షించాం

06-04-2026 01:11 AM
  1. అత్యంత రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నప్రత్యేక బలగాలు, డజన్ల కొద్దీ విమానాలు
  2. ఇరాన్ భూభాగంలో మా సైన్యం భారీ విజయం
  3. అమెరికా బలగాల ఆధీనంలో సురక్షితంగా ఎయిర్‌మ్యాన్ 
  4. ఈ ఆపరేషన్ అద్భుతమన్న డొనాల్డ్ ట్రంప్ 
  5. అమెరికా రెస్క్యూ సీ130ని కూల్చేశామన్న ఇరాన్
  6. దాడి చేసిన ఫరాజ్ రేంజర్స్ పోలీస్ కమాండో 
  7. ఈ ఆపరేషన్‌లో అనేక అగ్రరాజ్యం ఫ్లుట్లై కూడా ధ్వంసం
  8. అమెరికా దళాల్లో ఐదుగురు మృతి

వాషింగ్టన్/టెహ్రాన్, ఏప్రిల్ 5: ఇరాన్ భూభాగంలో తమ ఎయిర్‌మ్యాన్ చిక్కుకుపోయినప్పుడు అమెరికా సాహసోపేతమైన ఆపరేషన్‌ను నిర్వహించి అతన్ని రక్షించింది. దేశ చరిత్రలోనే తొలిసారి శత్రు భూభాగంలోకి వెళ్లి ఈ ఈపరేషన్‌ను తమ సైన్యం సమర్థవంతంగా నిర్వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తికాగానే ‘ఉయ్ గాట్ హిమ్’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఆయుధాలు, డజన్ల కొద్దీ యుద్ధ విమానాలతో అమెరికా దళాలు గాలింపు చేపట్టి పైలట్‌ను కాపాడినట్టు తెలిపారు. అమెరికా బలగాల ఆధీనం లోనే పైలట్ సురక్షితంగా ఉన్నట్టు వెల్లడించారు.

అయితే అమెరికా రెస్క్యూ సీ 130ని కూల్చేశామని ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఈ యుద్ధ విమానంపై ఫరాజ్ రేంజర్స్ పోలీస్ కమాండో యూనిట్ దాడి చేసిందని, ఈ ఆపరేషన్‌లో అనేక అగ్రరాజ్యం ఫ్లుట్లై కూడా ధ్వంసం అయ్యాయని ఇరాన్ వెల్లడించింది. ఈ దాడుల్లో అమెరికా దళాల్లో ఐదుగురు మృతి చెందారని పేర్కొంది. రెండు సీటర్ల అమెరికా యుద్ధ విమానం ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో గత శుక్రవారం కూలిపోయింది.

పైలట్ ప్ర మాదం నుంచి బయటపడగా, విమానంలోని వెపన్ సిస్టమ్ ఆధికారి జాడ గల్లం తైంది. ఇది జరిగిన రెండ్రోజుల్లో ట్రంప్ ఆదేశాలతో మిలటరీ డజన్ల కొద్దీ విమానాలు, సాయుధ బలగాలతో గాలింపు చర్యలు జరిపి ఎట్టకేలకు అతన్ని కాపాడింది. ఈ స్పెషల్ రెస్క్యూ ఆపరేషన్‌లో వందలాది సైనికులు పాల్గొన్నట్టు అధికారులు తెలిపారని జజీరా వార్తాసంస్థ తెలిపింది. ఇరాన్‌లో ని ప్రమాదకరమైన పర్వతాల్లో పైలట్‌ను గుర్తించి సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చినట్టు పేర్కొంది. ఎయిర్‌మ్యాన్ తలదాచుకు న్న ప్రదేశాన్ని ఇరాన్ బలగాలు గుర్తించకుండా యూఎస్ విమానాలు బాంబులు జారవిడుస్తూ, కాల్పులు జరుపుతూ ఆపరేషన్ నిర్వహించింది. రెండ్రోజులుగా ఈ ఆపరేషన్ సాగిస్తూ వచ్చింది.

ఎఫ్-15 పైలట్, వెపన్స్ సిస్టమ్ అధికారి తమ కమ్యూనికేషన్ సిస్టంల ద్వారా సంప్రదింపులు సాగించినట్టు సమాచారం. అమెరికా సైన్యం మరో సాహ స పైలట్ను సురక్షితంగా కాపాడిందని, తమ రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే దీనిని ఇంతవరకూ బహిర్గతం చేయలేదని ట్రంప్ ప్రకటించారు. ఏ ఒక్క అమెరికన్ యోధుడిని తాము ఒంటరిగా వదిలిపెట్టేది లేదని, ఇది అమెరికన్ ప్రజలు, రిపబ్లికన్లు, డెమోక్రాట్లు, ప్రతి ఒక్కరి గర్వించదగిన సందర్భమని అన్నారు. తమ బల గాలు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ ’అద్భుతం’ అని ట్రంప్ ప్రశంసలు కురిపించారు.

ఇరాన్ క్షిపణులు, రాడార్ సిస్టమ్‌ను కూడా ఖాతరు చేయకుండా ఇరాన్‌లోని పర్వత ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ జరిపినట్టు చెప్పారు. ఈ ఆపరేషన్ కోసం హెచ్‌హెచ్-60 డబ్లూ ‘జాలీ గ్రీన్ 2’ రెస్క్యూ హెలికాప్టర్లు, ఎ-10 వార్‌హగ్ అటాక్ జెట్, హెచ్సీ-130 రెస్క్యూ మిడ్-ఎయిర్ ట్యాంకర్, ఎఫ్-35 స్టెల్త్ జెట్లను అమెరికా రంగంలోకి దింపి ఇరాన్ భూభాగంలో అమెరికా సైన్యం భారీ విజయం సా ధించినట్లు ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉంటే అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్15ఈ ఫైటర్ జెట్ కూలడంతో గల్లంతైన రెండో పైలట్‌ను రక్షించామంటూ అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న వేళ.. ఇరాన్ షాకిచ్చింది.

ఆ పైలట్ కోసం రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ‘కూలిన యుద్ధ విమానంలోని పైలట్ కోసం గాలిస్తున్న శత్రుదేశానికి చెందిన విమానాన్ని ఇస్ఫహాన్ దక్షిణ ప్రాంతంలో ఐఆర్జేసీ దళాలు ధ్వంసం చేశా యి’ అని ఇరాన్ మీడియా పేర్కొంది. ఆ ఎయిర్‌క్రాఫ్ట్ అమెరికా వైమానిక దళానికి చెందిన సీ-130గా చెబుతోంది. ఫరాజ్ రేంజ ర్స్ పోలీసు కమాండో యూనిట్ ఈ విమానాన్ని కూల్చివేసినట్లు ఖతార్ మీడియా తెలిపింది. ఇతర ఫైటర్ జెట్లకు సీ130 రీప్యూయలింగ్ చేసేందుకు వచ్చినట్లు చెప్పింది. ఇందులోని సిబ్బందికి సంబంధించి ఎలాం టి సమాచారాన్ని వెల్లడించలేదు. దీనిపై అమెరికా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే ఈ ఆపరేషన్ సమయంలో ఇరాన్ సాయుధ దళాలు సంయుక్తంగా అనేక అమెరికా విమానాలను ధ్వంసం చేసినట్లు ఐఆర్టీసీ పేర్కొన్నట్లు ఇరాన్ మీడియా చెప్పింది. అదే సమయంలో జరిగిన దాడు ల్లో అమెరికా దళాలకు చెందిన ఐదుగురు మృతిచెందారని పేర్కొంది. ఖతమ్ అల్- అన్వియా కేంద్ర ప్రధాన కార్యాలయ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. కూల్చేవేసిన వాటిల్లో ఒక సీ విమానంతో పాటు, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఉన్నాయని చెప్పారు.