11 April, 2026 | 3:10 PM

Breaking News

20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •   ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కరించండి   •   పేదల అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •   ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు ప్రారంభించాలి

11-04-2026 12:00 AM

నిర్మల్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలో మొక్క జొన్న, జొన్న పంట కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గం లో మొక్కజొన్న పంటను విస్తారంగా రైతులు సాగు చేశారని కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం పది కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు శ్రేయస్కారంగా ఉంటుందని పేర్కొన్నారు.

స్పందించిన మం త్రి మొదటి విడుతగా నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ యార్డులో కొను గోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జొన్న పంట కొనుగోలు రాష్ట్రంలో ఎక్కడ కేంద్రాలు ప్రారంభించలేదని, త్వరలోనే నిర్మల్ జిల్లాలో జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన రాష్ట్రమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.