11 April, 2026 | 1:15 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

యోగాతో ఆరోగ్యం

11-04-2026 12:00 AM

కలెక్టర్ కే హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో యోగ ఫర్ వన్ ఎర్త్  వన్ హెల్త్ నినాదంతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి వేగవంతమైన జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ప్రతిరోజూ యోగా ఆచరించడం వల్ల శరీరానికి దృఢ త్వం, మనసుకు ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలోఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తో కలసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో రహదారి ప్రమా దాలు నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీఆర్డీఓ దత్తారావు పాల్గొన్నారు.