11 April, 2026 | 1:38 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం

11-04-2026 12:00 AM

ఎస్పీఎం మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు జే. మల్లికార్జున్

కాగజ్‌నగర్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : సిర్పూర్ కాగితం మిల్లు యాజమాన్యం కార్మికుల హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుందని సిర్పూర్ పేపర్ మిల్  యూనియన్ జనరల్ సెక్రటరీ కూష ణ రాజన్న ఆరోపించారు. శుక్రవారం విశ్రాంత ఉద్యోగుల భవనం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అనేక పరిశ్రమలలో ఎన్ని కలు జరుగుతున్నప్పటికీ కూడా సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చినటువంటి లేబర్ కోడ్లను అడ్డుపెట్టుకొని ఎన్నికలకు అడ్డు తగులుతుంది. ఇది సరైన ధోరణి కాదు.

రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్లును ఇంకా ఆమోదించలేదని రాష్ట్రంలో ఇంకా రూల్స్ ఫ్రేమ్ కాలేదని, రాష్ట్రంలో ఎక్కడ లేబర్ కోడ్స్ అమలు కావడం లేదని రాష్ట్రంలో అనేక పరిశ్రమలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ మధ్యకాలంలో  పది పరిశ్రమల లో ఎన్నికలు నిర్వహించారని కావున ఎస్పియంలో కూడా గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీఎం మజ్దూర్ యూ నియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపాల్, ఎస్పీ ఎం మజ్దూర్ యూనియన్  ఉపాధ్యక్షులు ముంజం శ్రీనివాస్, మహమ్మద్ షబ్బీర్, మొగిలి వెంకటేష్, సహాయ కార్యదర్శులు గడమల్ల మహేష్, కాశీపేట రాజేందర్, రామ్ శెట్టి రాజన్న, బిల్ల రమేష్, కోశాధికారి నీలి రాజన్న తదితరులు పాల్గొన్నారు.