యూరియా కోసం రైతుల ధర్నా.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
- పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సింగిల్ విండో చైర్మన్
- అడ్డుకున్న పోలీసులు
- బీఆర్ఎస్ నేతలను అడుగడుగునా అరెస్టు చేసిన పోలీసులు
- ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ అరెస్ట్
కామారెడ్డి,జూన్ 23 (విజయక్రాంతి): రైతులకు యూరియా సరఫరా(Urea supply) కావడం లేదని కామారెడ్డి జిల్లా తాడువాయిలు బీఆర్ఎస్ నాయకులు(BRS leaders) పిలుపునివ్వడంతో మంగళవారం ఉదయం నుంచి పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. తాడువాయి సింగిల్ విండో చైర్మన్ కపిల్ రెడ్డి, మరో వైపు పెట్రోల్ డబ్బాలతో రావడంతో పోలీసులు అరెస్టు చేశారు.
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్(Former Yellareddy MLA Jajala Surender arrested) బైక్ పై పోలీసులను తప్పించుకుని వచ్చి ఆందోళన కోసం నినాదాలు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాస్థాయి పోలీస్ లు తాడ్వాయి చేరుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు. రైతుల ధర్నా జరగకుండా అడుగున పోలీసులు అరెస్టు చేశారు. రైతులు కాదు బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తాడ్వాయిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.






