ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా: నియోజకవర్గం ఇన్చార్జి
బోథ్, జూన్ 23( విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి(Congress Party Constituency In-charge) ఆడే గజేందర్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వంజర కాలనీలో కాలనీవాసుల విన్నపం మేరకు బోరు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఆయనని సన్మానించారు. కాలనీవాసులు గత కొంతకాలంగా త్రాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారని అయితే సమస్యను తన దృష్టికి తేవడంతో పరిష్కారానికి చర్యలు తీస్తున్నామన్నారు.
పలువురు కాలనీవాసులు సైతం తమ విన్నపాన్ని విని బోరు బావి వేయించినందుకు సంతోషం వ్యక్తపరిచారు. తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేర్కొన్నారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కురుమే అన్నపూర్ణ మహేందర్ కాంగ్రెస్ పార్టీ బూతు మండల అధ్యక్షులు మెరుగు భోజన్న ఆత్మ డైరెక్టర్ రహీముద్దీన్ సన్నీ రెడ్డి వార్డు సభ్యులు పద్మారావు శ్రీనివాస్ శంషుద్దీన్ వంజరి సంఘం అధ్యక్షులు మల్లేష్ చరణ్ దీపు తదితరులు ఉన్నారు






