పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మహిళా కాంగ్రెస్ ఆందోళన
సిద్దిపేట, మే 17 (విజయక్రాంతి): పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతోందని మహిళా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెంచిన ధరలను వెంటనే తగ్గించడంతో పాటు ప్రజావ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ మంద వనజ, జిల్లా జనరల్ సెక్రటరీ కొడంగల్ రజిని, గొట్టే కవిత, టౌన్ అధ్యక్షురాలు మార్క పద్మ గౌడ్, బ్లాక్ ప్రెసిడెంట్ లహరి, మండల అధ్యక్షురాలు బాలలక్ష్మి, నంగునూరు మండల అధ్యక్షురాలు లావణ్య, టౌన్ వైస్ ప్రెసిడెంట్ సంతోషి, ఆత్మ కమిటీ డైరెక్టర్ సంతోషి, సన శ్యామల, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.






