27 August, 2026 | 7:51 PM

కొండా మురళితో భేటీకి సిద్ధం.. హైకమాండ్ చేతిలో మంత్రి సురేఖ భవితవ్యం

27-08-2026 01:09 PM

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొండా మురళితో(Konda Murali) భేటీకి సిద్ధంగా ఉన్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC Mahesh Kumar Goud) ప్రకటించారు. కొండా సురేఖ అంశంలో ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపారు. బీసీలకు కాంగ్రెస్ ఇచ్చినంత ప్రాధాన్యత ఏ పార్టీ ఇవ్వలేదని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ భవితవ్యం ఢిల్లీ హైకమాండ్ చేతిలో ఉందని చెప్పారు. క్రమశిక్షన కమిటీ కూలంకషంగా పరిశీలించి నివేదిక సమర్పించింది. మీనాక్షి నటరాజన్ పరిశీలన తర్వాత నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలిపారు. కొండా మురళి ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు.