15-02-2026 03:08:44 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): జిల్లా వైద్యాధికారి డాక్టర్ విద్యా ఆదేశాల మేరకు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం భిక్కనూర్ గ్రామంలోని సిద్ధిరామేశ్వర ఆలయంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. భిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దివ్య పర్యవేక్షణలో షిఫ్టులవారీగా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది నియమించబడ్డారు. భక్తుల అధిక తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఎవరైనా అనారోగ్యానికి గురి అయితే ప్రాథమిక చికిత్స అందించడానికి సరియైన మందులు అందుబాటులో ఉంచారు. ఈ హెల్త్ క్యాంపులో హెల్త్ అసిస్టెంట్ సతీష్, రెండో ఏఎన్‌ఎం శ్యామల, ఆశా కార్యకర్త రేణుక తమ సేవలను అందించారు.