calender_icon.png 15 February, 2026 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగులాంబ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు

15-02-2026 01:10:02 AM

అలంపూర్, (విజయక్రాంతి): అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ప్రముఖ ఐదవ శక్తిపీఠం ఆలంపూర్ శ్రీజోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.ముందుగా ఆలయ అధికారులు, వేద పండితులు మంత్రోచ్ఛారణ నడుమ గోపూజ, యాగశాల ప్రవేశం, ధ్వజరోహణ కార్యక్రమం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో శివరాత్రి మహోత్సవాలకు అంకురార్పణ చేసినట్లు ఆలయ ఈవో దీప్తి తెలిపారు. ఆదివారం మహాశివరాత్రిని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్న క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, క్యూ లైన్ లను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు.