calender_icon.png 8 February, 2026 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు లేని డివిజన్‌గా మారుస్తా

08-02-2026 12:00:00 AM

ప్రతి వ్యక్తి అభివృద్ధి బీజేపీ లక్ష్యం

మీ కుటుంబ సభ్యులుగా భావించి సంపూర్ణ మద్దతు తెలపండి 

మహబూబ్‌నగర్ 21 డివిజన్ బీజేపీ అభ్యర్థి గూండా సంతోష్

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): పాలమూరు కార్పొరేషన్‌లో సమస్యలు లేని డివిజన్‌గా మార్చేందుకు తమకు అవకాశం కల్పించాలని 21వ డివిజన్ బీజేపీ అభ్యర్థి గూండా సంతోష్ విజ్ఞప్తి చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని 21వ డివిజన్ లోగల శ్రీనివాస్ కాలనీలో ఆయన ఇంటిం ట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి సంతోష్ కుమా ర్ మాట్లాడుతూ  కాలనీ ఆవిష్కృతం అయినప్పటి నుంచి కాలనీపై సమగ్ర పట్టు తమకు ఉందన్నారు.

డివిజన్ లోని ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా పక్కా ప్రణాళికలతో ఉన్నామని పేర్కొన్నారు. కాలనీలో ఎల్లప్పుడూ అందరికీ సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఆపదలో ఉన్న వారికి నేనున్నా అనే భరోసా ఎల్లప్పుడూ ఉండేలా ఉంటానని స్పష్టం చేశారు. మా జీవితం ప్రజాసేవకే అంకితం అయ్యేలా పూర్తిస్థాయిలో కుటుంబమంతా ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. బీజేపీతోనే పాలమూరు కార్పొరేషన్ అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందన్నారు. ప్రతి ఓటరు బిజెపి అభ్యర్థి అయిన తమకు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేసి డివిజన్ అభి వృద్ధికి మరింత తోడ్పాటు అందించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.