30 August, 2026 | 11:49 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ముమ్మరంగా కొనసాగుతున్న జనగణన

15-05-2026 03:23 PM

ముకరంపుర,(విజయక్రాంతి): జనగణన 2027 ప్రక్రియలో భాగంగా‌ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని వివిధ డివిజన్లలో జనగణన పర్యవేక్షకుల మార్గదర్శనంలో ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి ఇండ్ల గణనకు సంబంధించిన సర్వేను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ... ఎన్యుమరేటర్లు పర్యవేక్షకుల మార్గదర్శనంలో ఇండ్ల గణనను సజావుగా చేపట్టాలని, ఏ ఒక్క ఇంటిని వదిలిపెట్టకూడదని, ప్రజలు తమ ఇంటి వివరాలను తెలియజేస్తూ ఎన్యుమరేటర్లకు సహకరించాలని కోరారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ జనగణన బాధ్యులు తిరుపతి మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు ఇండ్ల గణన సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా సమాచారాన్ని నమోదు చేయాలని కోరారు. కరీంనగర్ లోని లోని 64వ డివిజన్లో పర్యవేక్షకులు డాక్టర్ ఎం మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎన్యుమరేటర్లు శిల్పారాణి అరుణ సౌజన్య కిరణ్ కిరణ్మయి ప్రవీణ్ కుమార్ రమేష్ రెడ్డిలు జనగణన సర్వేను కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక అధికారులు వేణు తేజస్విని శ్రీధర్ సంధ్యలు , రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.