15 May, 2026 | 3:45 PM

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు

15-05-2026 02:53 PM

హైదరాబాద్: రాష్ట్రంలో SIR ప్రక్రియ పారదర్శకంగా జరపాలని కాంగ్రెస్ నేతలు తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డితో కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్,రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ,ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ,ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,నవీన్ యాదవ్, శ్రీ గణేష్ , కార్పొరేషన్ చైర్మన్ లు ,ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. SIR ప్రక్రియ చాలా పారదర్శకంగా జరపాలని మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్  ఎన్నికల అధికారికి వినతి పత్రం ఇచ్చారు.