08-02-2026 12:00:00 AM
అర్మూర్‌లోని 3వ వార్డు నుంచి యామాద్రి భాస్కర్ కవిత పోటీ
అర్మూర్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో మూడవ వార్డు బీజేపీ అభ్యర్థి యామాద్రి భాస్కర్ కవిత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్, విద్యా నగర్ కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మూడవవ వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని అభ్యర్థించారు.
వార్డు సమస్యలపై తనకు అవగాహన ఉందని గెలిచిన తర్వాత పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కౌన్సిలర్ గా గెలిపిస్తే బీజేపీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం ఉందన్నారు.గతంలో ఆర్మూర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా, ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వ హించిన తనకు పట్టణ, వార్డు సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో వార్డు అభివృద్ధికి నిధులు తీసుకొస్తానని ఆమె పేర్కొ న్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మందుల బాలులు యామాద్రి భాస్కర్ కవితకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అంతకు ముందు అభ్యర్థికి కాలనీ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వంగ వివేక్, కరణం కృష్ణ గౌడ్, ఎలిగేటి విత్తల్, నాయిని భాస్కర్, లింగోజి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.