ప్రత్యేక కవర్‌తో 50 ఏళ్ల వేడుకలు జరుపుకున్న మాజా
న్యూదిల్లీ, 23 జూలై 2026:
భారతదేశ స్వదేశీ, బిలియన్ డాలర్ల పండ్ల ఆధారిత పానీయం మాజా®, భారతీయ మామిడి పండ్ల అసలైన రుచిని తోటల నుండి లక్షలాది వినియోగదారులకు అందిస్తూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
జాతీయ మామిడి దినోత్సవం సందర్భంగా, కోకా-కోలా ఇండియా, భారత ప్రభుత్వ తపాలా శాఖ, మాజా® 50 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని ఒక 'ప్రత్యేక కవర్'ను విడుదల చేశాయి. ఈ సందర్భం గా, 'ప్రాజెక్ట్ ఉన్నతి' బై ఆనందన – ది కోకా-కోలా ఇండియా ఫౌండేషన్‌తో అనుబంధం ఉన్న మామిడి రైతులను కూడా సత్కరించారు. భారతదేశ మామిడి వారసత్వాన్ని పరిరక్షించడంలో, మాజా® ఐదు దశాబ్దాల ప్రయాణా న్ని సుసాధ్యం చేయడంలో తమ భాగస్వామ్యంతో కృషి చేసిన తరతరాల రైతు వర్గాలను ఈ సందర్భంగా ప్రశంసించారు.
సమాచార మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ, దిల్లీ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కల్నల్ అఖిలేష్ కుమార్ పాండే, కోకా-కోలా ఇండియా & సౌత్‌వెస్ట్ ఆసియా కమ్యూనికేషన్స్ అండ్ సస్టైనబిలిటీ, దేవయాని రాణా వైస్ ప్రెసిడెంట్ – పబ్లిక్ అఫైర్స్; కోకా-కోలా ఇండియా బాట్లింగ్ భాగస్వాములు; మామిడి సరఫరాదారు ఫుడ్స్ & ఇన్స్ లిమిటెడ్, ఎన్జీఓ భాగస్వామి సెండెక్ట్ సమక్షంలో ఈ ప్రత్యేక కవర్‌ను భారత ప్రభుత్వ గౌరవనీయ కేంద్ర ఆహార శుద్ధి పరి శ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ గారు విడుదల చేశారు.
1976లో ప్రారంభమైనప్పటి నుండి, భారతదేశ వ్యాప్తంగా తోటలలో పండించే ప్రియమైన మామిడి రుచిని మోసు కొస్తూ, మాజా® భారతదేశంలోని ప్రతి ఇంటిలో ఒక సుపరిచిత భాగంగా నిలిచింది. ఐదు దశాబ్దాలుగా, ఈ బ్రాండ్ ఏడాది పొడవునా భారతదేశ అత్యంత ఇష్టమైన పండు రుచితో వినియోగదారులను అనుసంధానిస్తూనే ఉంది. ఈ ప్రత్యేక కవర్, మామిడి తోటలు, ప్రసిద్ధ మాజా® బాటిల్ నుండి ప్రేరణ పొందిన ఒక చిత్రణ ద్వారా, భారతీయ మామిడితో మాజా®కు ఉన్న అనుబంధాన్ని బంధించి, ఒక శాశ్వత తపాలా బిళ్ళల రికార్డుగా నిలుస్తుంది.
‘బాటిల్‌లో మామిడి 50 ఏళ్ల వేడుక’ అనే శీర్షికతో ఉన్న ఈ డిజైన్, బ్రాండ్ ఐదు దశాబ్దాల ప్రయాణాన్ని చాటి చెబుతూ, దాని వెనుక ఉన్న రైతు వర్గాలను గౌరవిస్తుంది. '50 సాల్ సే, సిప్-సిప్ మే ఆమ్' అనే జాతీయ ప్రచారంతో కూడిన మాజా® స్వర్ణోత్సవ వేడుకల స్ఫూర్తితో రూపొందించిన ఈ ప్రత్యేక కవర్, భారతదేశ జాతీయ ఫలమైన మామిడితో, దాని వెనుక ఉన్న రైతులతో ఈ బ్రాండ్‌కు ఉన్న యాభై ఏళ్ల అనుబంధానికి శాశ్వత ప్రశంసగా నిలుస్తుంది.






