25 July, 2026 | 10:48 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు.. నోటీసులు జారీ చేసి పనులు నిలుపుదల

25-07-2026 09:38 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి):  ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని యంనంపేట్, నారపల్లిలో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం పనులు చేస్తున్న వారికి టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేసి అట్టి పనులను నిలుపుదల చేశారు. యజమానులు సెలవు దినాలలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నందున  పలుమార్లు కూల్చివేతలు చేయడమైనదని, కానీ భవన యజమానులు యధావిధిగా పనులు చేయుచున్నందున శనివారం టౌన్ ప్లానింగ్ విభాగం వారు పోలీసు శాఖ వారి సహాయంతో అట్టి 9 నిర్మాణములను సీజ్ చేయడమైనదని తెలిపారు. భవన నిర్మాణదారులు అనుమతులకు అనుగుణంగా నిర్మాణం చేసుకోవాలని నిబంధనలను అతిక్రమించినచో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొనబడతాయని అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీధర్ హెచ్చరించారు.