25 July, 2026 | 10:14 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి తీరు మారదా..?

25-07-2026 09:17 PM

ప్రశ్నించిన ఎంన్సిపిఐయు జిల్లా కార్యదర్శి అలెపు పీటర్

ఖానాపూర్ (విజయక్రాంతి):  నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి తీరు మారదా..? అని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్ ,సహాయ కార్యదర్శి భూక్య సురేందర్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పి స్వరూప ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి పనితీరును వారు పరిశీలించారు. వైద్యులు స్థానికంగా ఉండకుండా దూరప్రాంతాల నుంచి రావడంతో నిరుపేదలకు వైద్యం అందకుండా పోతుందని వారికోసం ప్రభుత్వం క్వార్టర్స్ నిర్మించినప్పటికీ వైద్యులు ఇక్కడ ఉండకపోవడంతో గృహాలు ఖాళీగా ఉంటున్నాయని అన్నారు. దానితోపాటు ఎక్స్రే మిషన్లు, పని చేయక స్కానింగ్ సెంటర్ లేకపోవడంతో ఇక్కడికి వచ్చిన రోగులు ప్రైవేటుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది.

దాంతో నిరుపేదలకు ఆర్థిక భారం పడుతుందని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో గర్భిణీ స్త్రీలు చికిత్స అందక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రైవేటు ఆసుపత్రులకు ఏజెంట్లుగా మారి రోగులను ఆసుపత్రి డాక్టర్లు నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తున్నారని వీరి ఆగడాలను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని సుమారు ఆరు మండలాల ప్రజలకు ఈ ఆసుపత్రి వైద్య సేవలు అందించాల్సి ఉండగా అరకొర వసతులతో నిరుపేదలకు వైద్యం అందకుండా పోయిందని విమర్శించారు.