బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి
25-07-2026 09:42 PM
వనపర్తి టౌన్ : బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు, వనపర్తి పట్టణంలోని నాగవరం తండాకు చెందిన గోపాల్ నాయక్ మృతిపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా గోపాల్ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






