25 July, 2026 | 10:10 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

ఎల్‌నినోపై రైతులకు అవగాహన

25-07-2026 09:07 PM

హుస్నాబాద్: అక్కన్నపేట మండలం మైసమ్మవాగు తండాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఎల్‌నినో ప్రభావం, ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారి తస్లీమా, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీలత మాట్లాడుతూ... వర్షపాతం తగ్గే అవకాశాల నేపథ్యంలో కంది, పెసర, మినుము, నువ్వులు, జొన్న, సజ్జ, వేరుశెనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. నేలలో తేమ సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ వ్యవసాయ శాఖ సలహాల మేరకు సాగు పనులు చేపట్టాలని రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం నాయక్, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.