25 July, 2026 | 10:45 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు

25-07-2026 09:33 PM

పెద్దమందడి: వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని శ్రీ భూనీలా సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ప్రత్యేక వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకు అర్చకులు విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎ. రాధాకృష్ణ, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు.