రాయ్‌పూర్‌లో హై ఓల్టేజ్ ఫైట్
- ముంబైతో తలపడనున్న ఆర్‌సీబీ
- ఓడితే ముంబై ఇంటికే
రాయ్‌పూర్, మే 9 : ఐపీఎల్ 19వ సీజన్‌లో ఆదివారం హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబో తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. రాయ్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్ డూ ఆర్ డై గా చెప్పాలి. దీ నిలో ఓడితే టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. ఇప్పటి వరకూ 10 మ్యాచ్ లు ఆడిన ముంబై 3 విజయాలతో పాయిం ట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.
ప్రస్తుతం సాంకేతికంగా మాత్రమే ముంబై ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. మిగిలిన నాలుగు మ్యాచ్ లూ గెలిస్తే 14 పాయింట్లు సాధిస్తుంది. అదే సమయంలో రన్ రేట్ మెరుగుపరుచుకోవడంతో పాటు మిగిలిన జట్ల ఫలితాలు కూడా కలిసొస్తేనే ప్లే ఆఫ్‌కు చేరుతుంది. గత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్‌పై భారీస్కోరును ఛేజ్ చేసి విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ, రికెల్టన్ ఫామ్‌లో ఉండగా.. సూర్యుకుమార్ నిరాశపరుస్తున్నాడు. ఈ సీజన్‌లో ఒక్క చెప్పుకోద గిన ఇన్నింగ్స్ కూడా అతను ఆడలేదు.
హార్థి క్ పాండ్యాది కూడా ఇదే పరిస్థితి. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన పాండ్యా ఆర్సీబీపై బరిలోకి దిగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆడతాడో లేదో అన్న అనుమానాలు వచ్చినా పాండ్యా జట్టుతో చేరడంతో సస్పెన్స్ కు తెరపడింది. బ్యాటింగ్‌లో నమన్ ధీర్, విల్ జాక్స్ , తిలక్ వర్మ కూడా చెలరేగాల్సిన అవసరం ఉంది. అటు బౌలింగ్‌లో బుమ్రా ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాడు. కానీ ఈ స్టార్ పేసర్ భారీగా పరుగులిచ్చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. శార్థూల్ ఠాకూర్ , బౌల్ట్ , ఘజన్‌ఫర్ వంటి వారితో బౌలింగ్ కూడా బాగానే ఉన్నా నిలకడలేమి ఇబ్బందిగా మారింది. బౌలర్లు సమిష్టిగా రాణించ కుంటే మాత్రం ముంబై ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది.
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒత్తి డిలో పడినట్టు కనిపిస్తోంది. వరుసగా రెం డు మ్యాచ్‌లు ఓడిపోవడం ఆ జట్టుకు మిం గుడుపడడం లేదు. గుజరాత్ పైనా తర్వాత లక్నో చేతిలోనూ ఊహించని విధంగా పరాభవాలు ఎదుర్కొంది. ప్రస్తుతం 10 మ్యాచ్‌ల లో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో ప్లేస్‌లో ఉన్న ఆర్సీబీ ముంబైని ఓడించి ప్లే ఆఫ్ రేసులో ముందంజ వేయాలని భావిస్తోంది. గత మ్యాచ్ లో ఓపెనర్లు బెథెల్, కోహ్లీ వైఫల్యం కొంపముంచింది.
పటిదార్, పడిక్కల్ , టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించినా భారీ టార్గెట్ ను ఛేదించలేకపోయింది. ఓపెనర్లు మంచి ఆరంభాన్నిస్తే ఆర్సీబీ ఎలాంటి లక్ష్యాన్నయినా ఛేదిస్తుంది. అటు బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ , హ్యా జిల్ వుడ్ అదరగొడుతున్నారు. ముఖ్యంగా భువీ వయసు మీద పడినా తనదైన పేస్ బౌలింగ్‌తో సత్తా చాటుతున్నాడు. అటు కృ నాల్ పాండ్యా, సుయాశ్ శర్మ కూడా రాణిస్తుండడంతో బౌలింగ్ పరంగా బెంగళూరు కు బెంగ లేదు. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు 35 మ్యాచ్ లలో తలపడితే ముంబై 19 సార్లు గెలిచింది. ఆర్సీబీ 16 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇక రాయ్ పూర్ పిచ్ బాలెన్సింగ్‌గా ఉంటుందని అంచనా.
తుది జట్లు అంచనా
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ, రికెల్టన్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్థిక్ పాండ్యా, తిలక్ వర్మ, రూథర్‌ఫర్డ్, శాంట్నర్, అశ్వని కుమార్, బుమ్రా , ఘజన్‌ఫర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : కోహ్లీ, బెథెల్, పడిక్కల్, పటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, హ్యాజిల్‌వుడ్






