4 July, 2026 | 2:49 AM

పొగమంచులా గ్యాస్.. భగ్గుమన్న మంటలు

04-07-2026 12:00 AM

టోల్‌ప్లాజాను ఢీకొన్న ఎల్పీజీ ట్యాంకర్

రెండు కి.మీ నుంచే కనిపించిన మంటలు

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఘటన

లక్నో, జూలై 3: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఓ గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి టోల్ ఫ్లాజా డివైడర్‌ను, ఆపై టోల్‌బూత్‌ను ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. కౌశాంబి జిల్లా కోక్‌రాజ్ పోలీసు స్టేషన్ పరిధిలో సంభవించిన ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.

జూన్ 26న ఉదయం కోఖ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోరి టోల్ ప్లాజా సమీపంలో ఈ సంఘటన జరిగింది. కాన్పూర్ నుంచి వారణాసికి వెళ్తున్న రెండు గ్యాస్ ట్యాంకర్లు షిహోరి టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఒకటి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో భారీగా ఎల్పీజీ గ్యాస్ లీకై పొగ మంచులా ఆ చుట్టుపక్కల ప్రదేశాలను కమ్మేసింది. ట్యాంకర్‌కు మంటలు అం టుకుని ఆ ప్రాంతమంతా అగ్నికీలల్లో చిక్కుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ శుక్రవారం బయటపడింది.

మంటలు చెలరేగడానికి కొన్ని క్షణాల ముందు, వేగంగా వస్తున్న ట్యాంకర్ డివైడర్ను ఢీకొట్టడం అందులో కనిపిస్తోంది. మంటలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, అవి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచే కనిపించాయి. మరో ట్యాంకర్ అంతకు ముందే టోల్‌ప్లాజాను దాటి వెళ్లింది. లేకపోతే ప్రమాద తీవ్రత మరింత పెరిగేది. ఈ ఘటనలో ఇ ప్పటి వరకు ట్యాంకర్ డ్రైవర్ ధ ర్మేంద్ర ద్వివేదితో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయా రు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.