22 March, 2026 | 1:46 AM

బైక్‌ని ఢీ కొట్టిన లారీ

21-03-2026 10:45 PM

ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు

మిర్యాలగూడ,(విజయక్రాంతి): మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల-కోదాడ రహదారి పై బైక్ ని లారీ ఢీ కొట్టగా ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర  గాయాలయ్యాయి. మిర్యాలగూడ గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా అన్నారం గ్రామానికి చెందిన శ్రీరాముల రాములు (60) మరో వ్యక్తితో కలిసి త్రిపురారంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా శ్రీనివాస్ నగర్ వద్ద వీరి బైక్ ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాములు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.