22 March, 2026 | 12:20 AM

సొంత నిధులతో కొత్త వాటర్ సంప్ నిర్మాణం

21-03-2026 10:41 PM

బీజేపీ కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలోని శ్రీ దుర్గమ్మ గుడి దగ్గర వాటర్ ప్రాబ్లంతో భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. శనివారం స్థానిక మున్సిపల్ 24 వ వార్డు బిజెపి కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ సొంత నిధులను వెచ్చించి కొత్త వాటర్ సంపును నిర్మించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మున్సిపల్ 24 అవార్డులో ఎలాంటి సమస్యలు కొన్న తన దృష్టికి తీసుకురావాలని సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కౌన్సిలర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం సీనియర్ నాయకులు వచ్ పల్లి శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.