21-02-2026 08:45:47 PM
మద్యం మాఫియాపై చర్యలు ఉండవా
ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులను అరికట్టాలి
ప్రతి కిరాణా కొట్టు బెల్ట్ షాపే
వసూళ్ల మత్తులో సంబంధిత అధికారులు
బెల్టు షాపులు నివారించడంలో శూన్యం
మద్యం చట్టాన్ని అనుసరించే అధికారులు ఎక్కడ?
బెల్ట్ షాపులను ను తక్షణమే రద్దు చెయ్యాలి
ఆదివాసీ నాయకుల డిమాండ్
చర్ల,(విజయక్రాంతి): మండలంలోని ప్రతి గ్రామంలో బెల్టు షాపుల ఊపు అందుకుంది, ప్రతి గ్రామంలో కిరాణా కొట్టు లేని గ్రామం ఉన్నదేమో కానీ, మద్యం బెల్ట్ షాపులు లేని గ్రామం అంటూ లేదు, దీనికి కారణం విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, మద్యం చట్టాలని అమలు చేసే అధికారులు వసూళ్ల మత్తులో ఉండటమే.. మద్యం వ్యాపారుల కనుసన్నల్లో నడుస్తున్నా బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇర్ప రాజు దొర డిమాండ్ చేశారు.
శనివారం పత్రిక ప్రకటన విడుదల చేస్తూ.. ఈ విధంగా మాట్లాడారు ఈ విషయమై అధికారులు స్పందించకుంటే "ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చర్ల మండలంలో ఉన్న ఏజెన్సీ ఆదివాసీ గ్రామల్లో ఉన్న బెల్ట్ షాపులు పై దాడులు నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు. చర్ల మండలంలో మద్యం శాఖ అధికారులు, మద్యం వ్యాపారులు వారి మనసులతో ఏర్పాటు చేసుకున్న వందలాది బెల్ట్ షాపులను అరికట్టాకుండ చోధ్యం చూడటాన్ని అధికారులును అనుమానించల్సి వస్తుందనీ. ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు దొర పేర్కొన్నారు.
కనీస నిబంధనలు పాటించడం లేదని అడుగు అడుగునా ఎటు చుసిన బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయని. మద్యం షాపుల్లో అయితే ఎమ్మార్పీ ధరలకే విక్రయించాల్సి వస్తుందనీ. మద్యం వ్యాపారులే బెల్ట్ షాపుల్లో అయితే ప్రతి బాటిల్ కి 50 రూపాయలు అదనంగా పెంచి విక్రయించొచ్చని. మద్యం షాపుల్లో లేని అన్ని రకాల బ్రాండ్స్, బెల్ట్ షాపుల్లో కి పంపించి మద్యం ప్రియులను విచ్చాలవిడిగా దోచుకుంటున్నారనీ. ఈ దోపిడీనీ అరికట్టాలనీ ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక డిమాండ్ చేస్తుందన్నారు. బెల్ట్ షాపులు నియంత్రణ పై మద్యం శాఖ అధికారులు కనీస ద్రుష్టి కూడా పెట్టడం లేదని అన్నారు.
మద్యం వ్యాపారులు ఇష్టరాజ్యంగా వ్యవహారిస్తూ ఉంటే అధికారులు చోద్యం చూడటం తగదన్నారు. మద్యం వ్యాపారులకు బెల్ట్ షాపులకు ఉన్న లింకు ప్రజలకు అర్ధం అవుతున్న అధికారులు మాములు మత్తులో ఏమి పట్టనట్టు వ్యవహారిస్తున్నారనీ వాపోయారు, బెల్ట్ షాపులు రద్దు కోసం యువత తో అన్ని గ్రామాల్లో ఉద్యమం కార్యాచరణ ప్రణాళిక ప్రక్రియ ఏర్పాటు చేస్తాం అని పేర్కొన్నారు...ఈ కార్యక్రమం లో ఆదివాసీసంక్షేమపరిషత్ మండల అధ్యక్షులు కంగాల. అభిరామ్, ఇరప. రాంబాబు, కణితి. సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.