17 July, 2026 | 8:18 PM

Breaking News

యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు   •   రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •   మునుగోడు నూతన ఎస్సైగా ఎం.శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ   •   భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు   •   మత్తు పదార్థంగా నొప్పి నివారణ టాబ్లెట్లు.. వినియోగిస్తున్న ముఠాపై కేసు   •   ఎన్క్యుఏఎస్ అంచనాకు ఆత్మకూరు ఏఏఎం కేంద్రం సిద్ధం   •  

బెస్ట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా లయన్ మహమ్మద్ రఫీ గోహర్

06-03-2026 09:35 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ బెస్ట్ డిస్ట్రిక్ట్ సెక్రెటరీగా ఆర్మూర్ పట్టణానికి చెందిన మహమ్మద్ రఫీ గోహర్ ఎన్నికయ్యారు. లయన్స్ క్లబ్ రీజినల్ కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డును ప్రధానం చేశారు. రీజినల్ చైర్మన్ రాజన్న  ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, లయన్ పి.బసవేశ్వరరావు, పీడీజీలు పెంటయ్య, ఈ.వీరేశం, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ మెంబర్, ఫస్ట్ వీడీజీ విజయలక్ష్మి, సెకండ్ వీడీజీ నరసింహారాజు సమక్షంలో ఎన్నుకొని ఘనంగా సత్కరించారు.

తనను బెస్ట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఎంపిక చేసినందుకు క్లబ్ సభ్యులకు, లయన్స్ సభ్యులందరికీ రఫీ గోహర్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ లయన్స్ క్లబ్బులైన ఆర్మూర్ నవనాథపురం, ఆర్మూర్ గ్రీన్, నిర్మల్, నిర్మల్ వారియర్స్, బాల్కొండ, బాల్కొండ ఫోర్ట్, భీమ్గల్, కమ్మపల్లి తదితర క్లబ్బుల సభ్యులు పాల్గొన్నారు.