ప్రమాదం అంచునలో లెవెల్ బ్రిడ్జి..
ఆ దారిలో వెళ్లేందుకు జంకుతున్న జనం
రెండుగా చీలిన లోలెవల్ బ్రిడ్జి.. పట్టించుకోని అధికారులు..
సిద్దిపేటరూరల్, మార్చి 8: నారాయణరావుపేట మండల కేంద్రం నుండి గుర్రాలగొంది గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న లోవ లెవెల్ బ్రిడ్జి రెండుగా చీలిపోయి ఓపక్క కిందికి వంగిపోయింది. అయినా కూడా అధికారులు దానిని పట్టించుకోవడం లేదని నారాయణరావుపేట, గుర్రాల గొంది గ్రామాలకు చెందిన పలువురు రైతులు వాపోతున్నారు.
రోజు తమ పొలాలకు వద్దకు వెళ్లే రైతులతోపాటు గుర్రాల గొంది, జక్కపూర్ గ్రామాల నుండి మండల కేంద్రానికి ఈ దారి గుండానే వాహనదారులు ప్రయాణిస్తారని, లో లెవెల్ బ్రిడ్జి ఓ పక్కకు వరగడంతో, అది ఏ క్షణాన కూలిపోతుందోనని ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నట్లు వారు తెలిపారు.
నారాయణరావుపేట మండల కేంద్రంలోని శనిగకుంట నుండి నీరు ఈ బ్రిడ్జి కింద నుండే వెళ్తుందని, గత వర్షాకాలంలో కురిసిన వర్షాలకు బ్రిడ్జి దెబ్బతిని, ఓ పక్కకు ఒరిగిందని ఇప్పటివరకు దానిని పట్టించుకున్న అధికారే లేడని, ఏ ప్రమాదం జరగకముందే, ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి కి మరమ్మతులు గాని, నూతన బ్రిడ్జి నిర్మాణం కాని చేపట్టాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జిల్లాలో రమేష్ గౌడ్ కోరారు.
ఇవి కూడా చదవండి:




