వనపర్తికి కేంద్రియ విద్యాలయం
వనపర్తి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి
విద్యార్థులకు జాతీయ స్థాయి విద్య
ఎమ్మెల్యే మేఘారెడ్డ్డి కృషితో వనపర్తి విద్యారంగంలో కొత్త దశ
వనపర్తి, మార్చి 8 (విజయక్రాంతి): వనపర్తి అంటేనే విద్యాపర్తిగా రాష్ట్ర స్థాయిలో పేరున్న సంగతి అందరికి తెలిసిందే. అలాంటి వనపర్తి జిల్లా కు ఎమ్మెల్యే మేఘా రెడ్డీ ప్రత్యేక చొరవతో కేంద్రియ విద్యాలయం మంజూరు చేయించడంతో విద్యా రంగంలో మరో కలికితురాయి చేరింది. కేంద్ర ప్రభుత్వం వనపర్తికి కేంద్రియ విద్యాలయం ను మంజూరు చేయడంతో జిల్లాలోని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. వనపర్తి మండలం రాజాపేట గ్రామ శివారులో గల వై టి సి బిల్డింగ్ లో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి.
విద్యార్థులకు జాతీయ స్థాయి విద్య
కేంద్రియ విద్యాలయాలు దేశవ్యాప్తంగా ఒకే విధమైన సిలబస్, నాణ్యమైన బోధన, సీబీఎస్‌ఈ విధానంలో విద్యను అందించడంలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. వనపర్తిలో ఈ విద్యాలయం ప్రారంభమవ్వడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు పెద్ద ఊరట లభించనుంది. ఇకపై ఉన్నత విద్య కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.
ఎమ్మెల్యే మేఘా రెడ్డి కృషి ఫలితం
ఈ విద్యాలయం మంజూరుకు స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన పట్టుదలైన ప్రయత్నాలు ప్రధాన కారణమని పార్టీ వర్గాలు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. సి ఎం రేవంత్ రెడ్డీ, జిల్లా మంత్రుల, ఎంపీ మల్లురవి సహకారంతో కేంద్రానికి వనపర్తి విద్యా అవసరాలను వివరించడంతో కేంద్రియ విశ్వ విద్యాలయం కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కేంద్రియ విశ్వ విద్యాలయం మంజూరు కు ఎమ్మెల్యే మేఘా రెడ్డీ చేసిన కృషి ఎనలేనిదని విద్యావంతులు, మేధావులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల్లో ఆనందం
వనపర్తి పట్టణంతో పాటు పరిసర మండలాల ప్రజలు ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. ఇది మా పిల్లల భవిష్యత్తుకు పెద్ద బలమయ్యే నిర్ణయం అని తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి, వనపర్తికి కేంద్రియ విద్యాలయం మంజూరు కావడం జిల్లాలో విద్యా అభివృద్ధికి మైలురాయిగా నిలవనుంది. ఎమ్మెల్యే మేఘా రెడ్డి కృషి ఫలితంగా సాధించిన ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మరిన్ని విద్యా అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోందని మేధావి వర్గాలు అభిప్రాయ పడుతున్నారు.
వనపర్తి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి
విద్యాపర్తిగా పేరుందిన వనపర్తి ఒడికి చేరిన కేంద్రీయ విద్యాలయం రావడం వనపర్తి కీర్తి కిరీటం లో మరో కలికితురాయి. ఈ విద్యా సంవత్సరం నుండి విద్యా భోదన ప్రారంభం అవుతుంది. ఈ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో నిరుపేద విద్యార్థులకు నాణ్యవంతమైన విద్య బోధన అందుతుంది. దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి నియోజకవర్గం నియోజకవర్గం విద్యాపరంగా క్రీడలపరంగా రాష్ట్ర స్థాయిలోనే గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నా.
తూడి మేఘా రెడ్డి, వనపర్తి శాసనసభ్యులు
ఇవి కూడా చదవండి:
ప్రమాదం అంచునలో లెవెల్ బ్రిడ్జి..




