బాధితుడికి రూ.౩ లక్షల ఎల్‌వోసీ అందజేత
ఇబ్రహీంటప్నం, జూలై 17 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండంలోని లోయపల్లి గ్రామానికి చెందిన కొర్ర రమేష్ నాయక్ ఆనారో గ్యంతో ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు. అయితే బాధితుడు వైద్య ఖర్చులకోసం ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డిని సంప్రదించారు. ఆయన తక్షణమే స్పందించి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో మంత్రి సహకారంతో మూడు లక్షల రూపాయల ఎల్‌వోసిని మంజూరు చేసి శుక్రవారం కొర్ర రమేష్ నాయక్ సోదరుడు కొర్ర భాస్కర్ నాయక్‌కి అందజేశారు. ఈ సందర్భంగా కొర్ర ర మేష్ నాయక్ కుటుంబ సభ్యులు మర్రి నిరంజన్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గణేష్ నాయక్, మోహన్ నాయక్ పాల్గొన్నారు.






