5 May, 2026 | 9:07 PM

యాదగిరిగుట్టను రాష్ట్రానికి మోడల్ గా తీర్చిదిద్దుదాం

05-05-2026 07:49 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్టను రాష్ట్రంలోనే ఒక మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యం అని దీనికోసం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం  యాదగిరిగుట్ట మున్సిపల్   కార్యాలయంలో కో ఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలేరు  శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య  చేతుల మీదుగా కోఆప్షన్ సభ్యులు గౌలికర్ అరుణ రాజేష్, ఎం.డి రహిమ సలాం, బండి జంగమ్మ , షేక్ ఉస్మాన్ షరీఫ్ కి నియామక పత్రాలు అందజేసి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అప్పుడే పార్టీలని ఎన్నికల అనంతరం ఆయా పట్టణాలు, గ్రామాలలో అభివృద్ధికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని అన్నారు.  యాదగిరిగుట్టను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దెందుకు ప్రతి ఒక్కరూ  పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని అన్నారు. కో ఆప్షన్ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవా నికి బిజెపి, బీఆర్ఎస్ గైరాజరైనారు.