5 May, 2026 | 9:12 PM

సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి

05-05-2026 07:50 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గుండి గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును విద్యార్థులు, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ రవీందర్ సూచించారు. మంగళవారం  కలిసి సమ్మర్ క్యాంపు–2026ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ... వేసవిలో సమయాన్ని వృథా చేయకుండా క్యాంపులో పాల్గొని శిక్షణ పొందాలని తెలిపారు. క్యాంపు ఏర్పాటుకు కృషి చేసిన డి.ఎస్.ఓ ఆశ్వక్ అహ్మద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్యాంపుకు కోచ్‌గా కిరణ్ కుమార్ వ్యవహరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్, డి.ఎస్.ఓ ఆశ్వక్ అహ్మద్, కోచ్ కిరణ్ కుమార్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.