10 June, 2026 | 1:44 PM

తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా (85) కన్నుమూత

10-06-2026 12:09 PM

చెన్నై: తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా (85) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతన్న భారతీ రాజా బుధవారం చెన్నై తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. 1941 జులై 17న జన్మించిన భారతీ రాజా 1977లో వచ్చిన పదహారేళ్ల వయసు సినిమాతో దర్శకుడిగా మారారు. త‌మిళ, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు ఎంతోమంది నటీనటులను పరిచయం చేసిన భారతీరాజా అధికంగా తమిళ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా తెలుగులో చాలావ‌ర‌కు రీమేక్ అయ్యాయి. అంతేకాకుండా   పదహారేళ్ల వయసు, సీతాకోక చిలుక, ఆరాధన సినిమాలకు జాతీయ అవార్డులు అందుకున్నారు. గ‌తేడాది కుమారుడు మ‌నోజ్ హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డం భార‌తీరాజాను తీవ్రంగా క‌లిచి వేసింది. అప్పటినుంచి అనారోగ్యం పాలయ్యారు.