కవితక్క రాజకీయ పార్టీ ఆవిర్భవ సభకు తరలిన నేతలు
25-04-2026 09:02 PM
చొప్పదండి,(విజయక్రాంతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సేవ రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి లీడర్లు, అభిమానులు భారీగా తరలి వెళ్లారు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లోని ఒక ప్రైవేటు కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఆవిర్భాసభకు జాగృతి జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి ఆధ్వర్యంలో చొప్పదండి నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో చోప్పదండి నియోజకవర్గ నాయకులు గుండేటి తిరుపతి, మండల నాయకులు పిట్టల సత్యం సిపేల్లి వెంకటేష్ రాకేశ్ రేడ్డి తదితరులు పాల్గొన్నారు.






