జాగృతి వ్యవస్థాపకురాలు కవిత జన్మదిన వేడుకలు జరుపుకున్న నాయకులు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): జాగృతి వ్యవస్థాపకురాలు కవిత జన్మదిన వేడుకలు సందర్భంగా నాగిరెడ్డిపేట మండల జాగృతి పార్టీ మండల నాయకులు ఆయా గ్రామాల అధ్యక్షులు కేకు కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. కామారెడ్డి జిల్లా కన్వీనర్ సంపత్, మండల అధ్యక్షులు సుభాన్ రెడ్డి ఆదేశాల మేరకు జాగృతి వ్యవస్థాపకురాలు కవితక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగిందన్నారు.
అనంతరం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ విష్ణు, జనరల్ సెక్రటరీ ఖలీల్, ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీను,యూత్ అధ్యక్షులు ఫయీం, మండల మహిళా అధ్యక్షురాలు పద్మ, మాల్తుమ్మెద, గోపాల్పేట్, చినుర్ గ్రామాల అధ్యక్షులు బలరాం, సిద్ధరాములు, బాతుల ప్రవీణ్, బాతుల నిఖిల్, సలహాదారులు యాదగిరి, ఎజాస్ తదితరులు పాల్గొన్నారు.




