13 March, 2026 | 7:24 PM

నీటి సమస్యకు పరిష్కారం

13-03-2026 03:46 PM

కుమ్రం భీం  ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని 11వ వార్డు సందీప్ నగర్‌లో నెలకొన్న తాగునీటి సమస్యకు చివరకు పరిష్కారం లభించింది. కాలనీలో చాలా కాలంగా నిలిచిపోయిన నీటి సరఫరా మళ్లీ ప్రారంభమవడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సందీప్ నగర్‌లో గత ఏడాది కాలంగా బోర్ మోటార్ దెబ్బతినడంతో కాలనీవాసులకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను కాలనీవాసులు 11వ వార్డు కౌన్సిలర్ కార్తీక్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కౌన్సిలర్ కార్తీక్ మోటార్‌కు అవసరమైన రిపేర్లు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో చాలా కాలంగా ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.