13 March, 2026 | 5:30 PM

శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

13-03-2026 04:30 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో శుక్రవారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పాఠశాల చిన్నారులు వివిధ వేషధారణలో చక్కగా రాణించారు. ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, కలెక్టర్ గా, జిల్లా విద్యాశాఖ అధికారిగా, ఎంఈఓ తో పాటు ఉపాధ్యాయులుగా చిన్నారులు చక్కగా తమ పాత్రలను పోషించి కోలాహాలంగా సెల్ఫ్ డే ను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ మాట్లాడుతూ విలువలతో కూడిన నైతిక విద్య వికాస అభివృద్ధి కోసం శ్రీ సరస్వతి విద్యా నిలయాలు పనిచేస్తున్నాయన్నారు.

విద్యతోపాటుగా సమాజ పోషణ, కుటుంబాలతో సంపర్కాలు, మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా విద్యా వికాసానికి తమ పాఠశాల పునాది వేస్తుందన్నారు. ఆంగ్ల భాష నైపుణ్య వికాసం కోసం ప్రత్యేక శిక్షణను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం వివిధ వేషధారణలో అలరించిన చిన్నారులకు బహుమతులను అందించారు. ముఖ్యమంత్రిగా తల్లం అకుల్, విద్యాశాఖ మంత్రిగా రిషిక, కలెక్టర్ గా తల్లం మహదేవ్, డీఈఓ గా శివమాన్ సింగ్, ఎంఈఓ గా హాసినిలు చక్కగా రాణించాలన్నారు. కార్యక్రమంలో  మాతాజీలు నాగమణి, స్వాతి, మానస, శ్రావణి, జయ, నాగలక్ష్మి, సత్యవతి, పార్వతి, పాఠశాల కార్యాలయ ప్రముఖ్ రాములు తదితరులు పాల్గొన్నారు.