ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి
రాజీవ్ గాంధీ సేవలు యువతకు ఆదర్శం
కాంగ్రెస్ పార్టీ మండలఅధ్యక్షులు మానుక సత్యం
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానుక సత్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా మానుక సత్యం మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధి కోసం విశేష సేవలు అందించారని, దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సేవా భావం ప్రతి యువతకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.
దేశ అభివృద్ధి, సాంకేతిక రంగ పురోగతికి రాజీవ్ గాంధీ చేసిన కృషిని యువత గుర్తుంచుకోవాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గచ్చకాయల ఎల్లయ్య ఫ్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు బండి ప్రభాకర్, జిల్లా నాయకులు గొట్టె రుక్మిణి, చేపూరి గంగాధర్, చందనగిరి గోపాల్, నాలుక సత్యం, కర్రోళ్ల భాస్కర్, ఆయాగ్రామల సర్పంచులు,డైరెక్టర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు యువత తదితరులు పాల్గొన్నారు.






